Friday, 9 August 2013

'తెలంగాణ' సెగతో రగిలిన ఉద్యమాలు

'తెలంగాణ' సెగతో రగిలిన ఉద్యమాలు

Written by Siramdasu Nagarjuna | Updated: August 03, 2013 20:16 (IST)
'తెలంగాణ' సెగతో రగిలిన ఉద్యమాలుబోడోలాండ్ ఉద్యమ తీవ్రత
యుపిఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యూసి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ప్రకటనతో చిన్నరాష్ట్రాల ఉద్యమాల తేనె తుట్టిని కదిపినట్లయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకు ఆమోదం తెలిపితే  దేశం మొత్తంలో చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకుంటాయని, అలా ఏర్పాటు చేస్తే దేశ సమాఖ్య వ్యవస్థకే భంగం కలుగుతుందని  సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు ముందే హెచ్చరించారు. వారు చెప్పిన విధంగానే తెలంగాణ ప్రకటనతో దేశంలోని ఈశాన్యం ప్రాంతం ఒక్కసారిగా  భగ్గుమంది. పశ్చిమ బెంగాల్‌లో గూర్ఖాలాండ్, అస్సాంలో బోడోలాండ్, మహారాష్ట్రలో విదర్భ ఉద్యమాలు, ఉత్తర ప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.

అస్సాంలో బోడోలాండ్ ఉద్యమం ఉధృతరూపం దాల్చింది.  అస్సాంను నాలుగు రాష్ట్రాలుగా (బోడోలాండ్, కామ్తాపుర్, దిమా హసో, కర్బీ ఆంగ్‌లాంగ్) విభజించాలన్న డిమాండ్‌తో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. బోడో సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ బంద్ లు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఉద్యమం విధ్వంసాలకు, హింసకు కూడా దారి తీసి ప్రమాదస్థాయికి చేరింది. ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డు రవాణ శాఖ బస్సులును దగ్ధం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు.  అస్సాంలోని దిఫులో   ఎంపీ బెరైన్‌సింగ్ ఎంగ్టీ రబ్బరు తోటతోపాటు ఆయన ఇంటికి శుక్రవారం నిప్పుపెట్టారు. రైల్‌రోకోలో భాగంగా వివిధ బోడో సంఘాలకు చెందిన ఆందోళనకారులు దిఫు-లుండింగ్ సెక్షన్‌లో ఆరు కిలోమీటర్ల మేర పట్టాలను తొలగించారు. ప్రత్యేక బోడోలాండ్ కోసం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఈ నెల 5 నుంచి 1,500 గంటల బంద్‌కు పిలుపు ఇచ్చింది.

బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతంలో కూడా ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో బంద్ లు, ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.  డార్జిలింగ్ పట్టణంలో శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. ప్రక్రియతోంగ్ ప్రాంతంలో కొందరు దుండగులు ఓ హోంగార్డుకు నిప్పంటించారు. ఆందోళనకారులు పలు చోట్ల ప్రభుత్వ ఆస్తులకు నిప్పుపెట్టారు.  తాక్‌దా ప్రాంతంలో  ఓ ఫారెస్ట్ బంగ్లాకు నిప్పంటించారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో న్యాయమైన తమ డిమాండ్లను కూడా పరిష్కరించాలని గూర్ఖాలాండ్, బోడోలాండ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ను విభజించి ప్రత్యేక గూర్ఖాలాండ్, అస్సాంను విభజించి ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయడం తప్ప ప్రస్తుతం తమకు మరో మార్గం లేదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ఎంపీ సాన్సుమా ఖున్గుర్ బిశ్వముతియారిలు హెచ్చరించారు. డార్జిలింగ్ పర్వతప్రాంతం ఎన్నడూ పశ్చిమబెంగాల్‌లో భాగం కాదని, తాము పశ్చిమబెంగాల్‌తో కలసి ఉండాలని కోరుకోవడం లేదని రోషన్ గిరి స్పష్టం చేశారు. ప్రత్యేక బోడోలాండ్ డిమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు ఆగస్టు 5న అస్సాంలోని కోక్రాఝర్‌లో బిశ్వముతియారి ర్యాలీకి పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినప్పుడు, బోడోలాండ్ ఎందుకు ఇవ్వదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై యుపిఏ తీసుకున్న నిర్ణయం ఈ ఉద్యమాలకు ఊపిరులూదినట్లయింది. ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్‌లో కొనసాగుతున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో గూర్ఖాలాండ్ ఉద్యమం తిరిగి పుంజుకునేలా కేంద్రం రెచ్చగొడుతోందని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ దుయ్యబట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించిన నేపథ్యంలో చిరకాలంగా ఇదే తరహా డిమాండ్ చేస్తున్న విదర్భ ప్రజల ఆకాంక్షను కూడా నెరవేర్చాలని నాగపూర్  కాంగ్రెస్ ఎంపీ విలాస్ ముత్తెమ్వార్  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరుతూ లేఖ రాశారు. ప్రత్యేక తెలంగాణకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ బిఎస్ పి అధినేత్రి మాయావతి  ఉత్తరప్రదేశ్ ని కూడా నాలుగు రాష్ట్రాలుగా విడగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె చెబుతున్నారు.  యూపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

 దేశంలో ఎన్నో ఏళ్లుగా  23 ప్రాంతాలలో కొత్తరాష్ట్రాల కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌ ఈశాన్య ప్రాంతం, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు కలసి మొత్తం 13 జిల్లాలతో బుందేల్‌ఖంఢ్‌ రాష్ర్ట ఏర్పాటు కోసం 1956 నుంచి ఉద్యమం జరుగుతోంది. మహారాష్ర్టలో విరాది మాండలికం కలిగిన ప్రాంతాలైన 13 జిల్లాలతో కలిపి ప్రత్యేకంగా విదర్భ రాష్ర్టం కోసం 45 ఏళ్ళుగా ఉద్యమం జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిని రాజధానిగా చేసుకొని యూపిలోని 27 జిల్లాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలు కలిపి పూర్వాంచల్‌ రాష్ర్టం ఏర్పాటు చేయాలని ఆరు దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఇంకా మధ్యప్రదేశ్‌లో గోండ్వానా,  కాశ్మీర్‌లోని లడక్‌,  గుజరాత్‌లోని సౌరాష్ర్ట పేరుతో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఎంతోకాలంగా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు.

రాష్ట్రాల విభజన విషయంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ గానీ, బిజెపి గానీ ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను ఆలోచించకుడా రాజకీయ ప్రయోజనాలనే ఆలోచిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపించడంతో కాంగ్రెస్ ఆదరాబాదరగా తెలంగాణపై నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో బిజెపి నేతలు ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ వస్తున్నారు. సమయానుకూలంగా మాట్లాడటం వారికి అలవాటైపోయింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంత ఆషామాషీ విషయం కాదని ఆ పార్టీ అగ్రనేత లాల్‌కిషన్‌ అద్వానీ గతంలో పలుమార్లు చెప్పారు. బిజెపి కాడినాడ సమావేశంలో ఒక ఓటు-రెండు రాష్ట్రాలు అని చెప్పి, ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఊసు ఎత్తలేదు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో చత్తీస్‌గఢ్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు  విదర్భ రాష్ర్ట ఏర్పాటు ప్రస్తావన కూడా వచ్చింది. ఆ సమయంలో  ఉప ప్రధానిగా ఉన్న ఎల్.కె.అద్వానీ హొం శాఖను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం ఏర్పాటు చేయడాన్ని మహారాష్ట్రలో ఎక్కువ మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, అందువల్ల అక్కడ శాసనసభలో తీర్మానం చేయాలని స్పష్టం చేశారు. కాని తెలంగాణ విషయంలో అందుకు విరుద్ధంగా, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తీర్మానం చేయకపోయినా పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ప్రకటిస్తామని బిజెపి పలుమార్లు ప్రకటించింది. కాంగ్రెస్ మాదిరిగా బిజెపి కూడా తెలంగాణపై ప్రేమతో కాకుండా రాజకీయ ప్రయోజనాలు అశించే తెలంగాణకు మద్దతు పలుకుతోందని స్సష్టమవుతోంది.

సన్మార్గం : మధురం, మహాప్రసాదం... శ్రీవారి నైవేద్యం

సన్మార్గం : మధురం, మహాప్రసాదం... శ్రీవారి నైవేద్యం

Sakshi | Updated: August 03, 2013 03:58 (IST)
సన్మార్గం : మధురం, మహాప్రసాదం... శ్రీవారి నైవేద్యం
తిరుమలేశుని లడ్డు, ప్రసాదాల తయారీకి  అవసరమైన 16 వేల మెట్రిక్ టన్నుల ముడిపదార్థాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం టీటీడీ ఏటా సుమారు రూ.175 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. వీటిలో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం.

 తిరుమలేశునికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం లడ్డు.  భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి.

 భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది.

  దిట్టం వల్లే లడ్డూకు మాధుర్యం
 శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం (శ్రీవారి స్టోర్) నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం 5100 లడ్డూలు మాత్రమే తయారుచేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు. ఈ లెక్కప్రకారం ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, ఏలకులు 4 కిలోలు వినియోగిస్తారు. దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.

 వకుళమాత రుచి చూసిన తర్వాతే నైవేద్యం
 తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల)కు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించినచోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారుచేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.

 ప్రత్యేక ఉత్సవాల్లో మాత్రమే ఆస్థానం లడ్డూ
 శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుపతి లడ్డూలు మూడురకాలుగా తయారు చేస్తారు. వీటిని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు. భక్తులకు లభించే లడ్డు. 175 గ్రాములు బరువున్న దీని ధర రూ.25.

 లడ్డు, ప్రసాదాల తయారీకి ఏటా రూ.175 కోట్ల ఖర్చు
 తిరుమలేశుని లడ్డు, ప్రసాదాల తయారీకి అవసరమైన 16 వేల మెట్రిక్ టన్నుల ముడిపదార్థాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం టీటీడీ ఏటా సుమారు రూ.175 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. వీటిలో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. ఖర్చులు పోను లడ్డు ప్రసాదాల అమ్మకం ద్వారా ఏటా దాదాపుగా పది కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం లభిస్తోంది. అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన తిరుమల వెంకన్న లడ్డు ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు సాధించింది. టీటీడీ తయారుచేసే ఈ తరహా లడ్డూ మరెక్కడా తయారుచేయకూడదనే ఉద్దేశంతో చెన్నయ్‌లోని జియోగ్రఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం ద్వారా మేథోసంపత్తి హక్కులు దక్కించుకుంది.

అసాధారణ ప్రతిభావంతుడు రాజన్

అసాధారణ ప్రతిభావంతుడు రాజన్
Written by Siramdasu Nagarjuna | Updated: August 06, 2013 18:47 (IST)
అసాధారణ ప్రతిభావంతుడు రాజన్
రిజర్వ్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. అదే రోజు 23 గవర్నర్‌గా రాజన్‌ బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. రాజన్‌ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్‌ బ్యాంకుకు ఐఏఎస్‌ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్‌ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే. ఐఏఎస్‌ కాకపోయినా రాజన్‌కు గవర్నర్‌ పదవి దక్కడానికి ఆయన మేధస్సే ప్రధాన కారణం. అసాధారణమైన ప్రతిభావంతుడిగా రాజన్‌కు పేరుంది. ప్రస్తుతం భారత దేశం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని  ఎదుర్కొంటోంది. ఈ సమయంలో  ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ బాధ్యతలు చేపట్టడం ఆశాజనకమైన పరిణామం.

రఘురామ్‌ రాజన్‌ భోపాల్‌లో 1963 ఫిబ్రవరి 3న జన్మించారు. ఆయన తండ్రి దౌత్యవేత్త.  అందువల్ల 7వ తరగతి వరకు  రాజన్ విదేశాల్లోనే చదువుకున్నారు.  ఆ తర్వాత నుంచి ఢిల్లీలో చదువుకున్నారు. 1985లో ఢిల్లీ ఐఐటీ నుంచి గోల్డ్‌ మెడల్‌తో బీటెక్‌ పట్టా అందుకున్నారు.  అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. బ్యాంకింగ్‌ రంగంపై సమర్పించిన పత్రానికి ఎంఐటి  పీహెచ్‌డీ మంజూరు చేసింది. రాజన్ చికాగోలోని బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో పని చేశారు. ఐఎంఎఫ్ లో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఫైనాన్స్ రంగంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అదే ఏడాది మన దేశానికి గౌరవ ఆర్థిక సలహాదారుగా ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ నియమించారు. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యంత చిన్న వయసులో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

 దువ్వూరి సుబ్బారావు తొలుత మూడేళ్ల కోసం గవర్నర్ గా నియమితులయ్యారు. అనంతరం మరో రెండేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. సుబ్బారావు హయాంలో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఆయన వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లారు. ఈ పరిణామం కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని పెద్ద కంపెనీలు కూడా వాయిదాలు కట్టలేక చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరానికి, సుబ్బారావుకు మధ్య దూరం పెరిగింది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న రాజన్‌ ఈ దూరాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

mahesh babu birthday special teaser

Mahesh Babu Birthday Teaser:The most awaiting teaser of mahesh's ongoing venture 1-nenokkadine is out now. We know that the first one went really viral on web and hope the second one too do the same. He looks completely different from his previous pictures. His style, his body looks more younger than what he was. Check out the video and have an eye feast.
 

ఇదీ... వ్యాయామ ‘చిత్రమ్’...

ఇదీ... వ్యాయామ ‘చిత్రమ్’...

Sakshi | Updated: June 29, 2013 04:14 (IST)
ఇదీ... వ్యాయామ ‘చిత్రమ్’...
హైదరాబాద్ జిల్లా :
వ్యాయామాల్లో రన్నింగ్ అడ్వయిజబుల్ కాదు. వాకింగ్, లేదా సైక్లింగ్ బెటర్. మట్టి, గడ్డి ఉన్న చోట మాత్రమే నడక మంచిది. 
 
 ‘‘కండలు తిరిగిన మగాడి కళ్లలో భయం చూస్తుంటే... భలే మజాగా ఉంది’’ అంటూ దెయ్యం పట్టిన హీరోయిన్ వికృతమైన ముఖంతో అంటుంటే భయంతో చెమట్లు పట్టిన అబ్బాయి... అభినయంతోపాటు అందంతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరోల కొరత తీర్చేలా తెరపై తళుక్కుమన్న ఆ అబ్బాయి ‘‘ప్రేమ కథాచిత్రమ్’’ హీరో సుధీర్‌బాబు. గ్రీకు శిల్పం లాంటి తన ఫిజిక్ వెనుక రహస్యాల్ని ఆవిష్కరిస్తూనే... ‘సాక్షి ఫ్యామిలీ’ పాఠకులకు కొన్ని ఫిట్‌నెస్ టిప్స్ కూడా అందించారు సుధీర్. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...
 
 క్రీడలే తీర్చిదిద్దాయి...
 
 చిన్న వయసు నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం అనేది ఎవరికైనా మంచి ఫిట్‌నెస్‌ని, ఆరోగ్యాన్ని అందిస్తుందని నా విషయంలో రుజువైంది. టీనేజర్‌గా ఉన్నప్పుడే షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. తర్వాత తర్వాత పుల్లెల గోపీచంద్ పార్ట్‌నర్‌గా జాతీయస్థాయిలో ఆడాను. అలాగే సినిమాల్లోకి రాకముందే ఫిట్‌నెస్ రొటీన్ ఉండేది. కొన్నేళ్ల నుంచి మారకుండా స్థిరంగా ఉన్న నా రెగ్యులర్ వెయిట్ 73 కిలోలు. వారానికి కనీసం 4 నుంచి 5 రోజులు తప్పనిసరిగా వ్యాయామానికి సమయం కేటాయిస్తాను. అలాగని గంటల తరబడి చేయను. రోజుకి 30 నుంచి 40 నిమిషాలు అంతే. సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఫిట్‌గా ఉన్నా కాబట్టి...  సిక్స్‌ప్యాక్ కోసం స్పెషల్ వర్కవుట్స్ చేశాను. ఆరునెలల్లోనే సాధించాను. అయితే దీనికోసం ప్రయత్నించేటప్పుడు ముఖవర్చస్సు దెబ్బతినకుండా డైట్ స్పెషల్‌గా తీసుకున్నాను.  ఆలివ్ ఆయిల్, పప్పులు, పీనట్ బటర్ వంటి మంచి ఫ్యాట్‌ని అందించే ఫుడ్‌ని రెగ్యులర్‌గా వినియోగించాను. అయితే సినిమాల కోసం అని కాకుండా ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండడానికే నేను ప్రయత్నించాను. నా సర్కిల్‌లో సుధీర్ అనగానే ఫిట్‌గా ఉంటాడనే ఐడెంటిటీ ఉంది. అది పోగొట్టుకోకూడదనే నా ఆలోచన. 
 
 పరిగెత్తవద్దు...పాలు తాగొద్దు...
 
 ఏదో సామెత అనుకుంటున్నారా? కాదండీ. ఇది  ఆరోగ్య సూత్రం మాత్రమే. కాని ‘మేత’కు సంబంధించే అనుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. కొవ్వులు, ప్రొటీన్... అందరికీ కావాలి. కాకపోతే వయసు, బరువును బట్టి... అవసరం మారుతుంటుంది. చిన్నపిల్లలకు కొన్ని రకాల ఎంజైమ్స్ ఉద్భవిస్తాయి కాబట్టి వారికి ఓకే కాని... ఒక వయసు దాటిన తర్వాత పాలు మనకి జీర్ణం కావు. కాబట్టి పాలు తాగకూడదు.  సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా ఎవరైనా సరే... మన దేహపు బరువుకి 2 రెట్లు ప్రొటీన్ మనకి అవసరం. అంటే సన్నగా మారాలనుకున్నవారు కూడా ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ఇక లావుగా ఉన్నవాళ్లు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే రైస్, గోధుమ వంటివి తగ్గించాలి. షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అసలు మంచిదికాదు. కాఫీ, టీలలో పంచదార కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు పెరుగు ఓకే. బాడీలో ఇమ్యూనిటీని అది పెంచే అవకాశం ఉంది. తగిన శారీరక శ్రమ ఉన్నవాళ్లు రోజుకి 6సార్లు ఆహారాన్ని విభజించాలి. రోజులో 150గ్రా.చికెన్ లేదా దాంతో సమానమైన ప్రొటీన్ ఫుడ్, ఎగ్‌వైట్స్ తీసుకోవాలి. ఆరుసార్లు కుదరకపోతే... ప్రొటీన్‌షేక్స్‌ని ఆహారంలో భాగం చేయవచ్చు. 
 
  స్లిమ్‌గా ఉండాలంటే  ప్రతిరోజూ కార్డియో వాస్క్యులర్ ఎక్సర్‌సైజ్‌లు తప్పనిసరి. ఈ వ్యాయామాలు చేసే సమయంలో 220 నుంచి మన వయసును మైనస్ చేసి ఆ వచ్చిన  దానిలో 65 శాతంతో సమానంగా మన పల్స్‌రేట్ ఉండాలి. అదే పల్స్‌రేట్ మెయిన్‌టైయిన్ చేయాలి. అంతకన్నా పల్స్‌రేట్ పెరిగితే అవసరమైన మజిల్ కూడా నష్టపోతాం. అలాగే- 
 
 ఒక రోజున ఒకటి లేదా రెండు మజిల్స్‌కి మించి ఒకేసారి వ్యాయామం ఇస్తే... సరైన ఫలితం రాదు. ఉదాహరణకి సోమవారం ఛాతీకి సంబంధించిన ఎక్సర్‌సైజ్ చేస్తే మంగళవారం మరో మజిల్... ఇలా మార్చుకుంటూ పోవాలి. తిరిగి ఛాతీకి వ్యాయామం చేసే సమయానికి అది పూర్తిగా రికవరీ అయి ఉంటుంది. వ్యాయామాల్లో రన్నింగ్ అడ్వయిజబుల్ కాదు. వాకింగ్, లేదా సైక్లింగ్ బెటర్. మట్టి, గడ్డి ఉన్న చోట మాత్రమే నడక మంచిది. అలాగే  సరిగ్గా నప్పే షూస్ ధరించాలి. 
 
 .... ఇవీ టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సుధీర్  చెప్పిన ఫిట్‌నెస్ కబుర్లు. ఈ నవయువ హీరోకి ఆరోగ్యాభిలాషుల తరపున థ్యాంక్స్.
 

MP Vijaya shanthi meet with sonia Gandhi along with Renuka chowdary

P / Politics
MP Vijaya shanthi meet with sonia Gandhi along with Renuka chowdary
05:09 AM on 09th August, 2013

Violence erupted in delhi juvenile home where dec 16 delhi rape accused lodged, december 16 rape case, Mahesh babu new movie one nenokkadine teaser release, Priyanka chopra latest item song in Zanjeer movie, priyanka chopra new item song in zanjeer movie, priyanka chopra latest hot song in zanjeer, priyanka chopra hot stills from zanjeer movie, zanjeer 2013 movie hot item song, attarintikidaredi movie tickets online, attarintiki daredi movie release date, hyderabad as union territoryViolence erupted in delhi juvenile home where dec 16 delhi rape accused lodged, december 16 rape case, Mahesh babu new movie one nenokkadine teaser release, Priyanka chopra latest item song in Zanjeer movie, priyanka chopra new item song in zanjeer movie, priyanka chopra latest hot song in zanjeer, priyanka chopra hot stills from zanjeer movie, zanjeer 2013 movie hot item song, attarintikidaredi movie tickets online, attarintiki daredi movie release date, hyderabad as union territory
Violence erupted in delhi juvenile home where dec 16 delhi rape accused lodged, december 16 rape case, Mahesh babu new movie one nenokkadine teaser release, Priyanka chopra latest item song in Zanjeer movie, priyanka chopra new item song in zanjeer movie, priyanka chopra latest hot song in zanjeer, priyanka chopra hot stills from zanjeer movie, zanjeer 2013 movie hot item song, attarintikidaredi movie tickets online, attarintiki daredi movie release date, hyderabad as union territory

WHO WATCHED POWERSTAR'S SPECIAL SHOW?