remuneration of heros Updated: Thursday, July 25, 2013, 12:00 [IST] Ads by Google Naukri.com - Register Now Get Headhunted by Best Recruiters Top MNCs, Best Profile, High CTC Naukri.com Booked Bus With Goibibo™ Now Get Rs.800 Off On Hotel Booking above Rs.2500. Use Code: HTL800Off goibibo.com/hotels/offer హైదరాబాద్ : అన్నీ పెరుగుతున్నాయి...హీరోల రెమ్యునేషన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునేషన్స్ అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. బడ్జెట్ పెరుగుతున్నప్పుడు రెమ్యునేషన్ పెంచటంలో తప్పేమి అన్నట్లు హీరోలు డిమాండ్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో బిజినెస్ కూడా అదే రేంజిలో జరుగుతూండటంతో నిర్మాతలు వెనకడుగు వేయటం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రెమ్యునేషన్స్ అందరికీ ఆశ్చర్యపరిచే రీతిలో పెరిగాయి. ఇప్పటికే ఎవరూ ఊహించనంత రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరూ మరో ఆసక్తికర విషయంతో వార్తల్లోకెక్కబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో యూటివి మోషన్ పిక్చర్స్ సంస్థతో ఓ సినిమా చేయబోతున్నారు. దేశంలోని అతిపెద్ద సినీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈ సంస్థ మహేష్ బాబుతో చేసే చేయబోయే సినిమాకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో దక్షిణాది పెద్ద సినీ నిర్మాణ సంస్థలో ఒకటైన పివిపి బేనర్లో సినిమా చేయబోతున్నారు. వీరు కూడా పవన్ కళ్యాణ్‌కు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. పవన్ కళ్యాన్ ఇటీవలే తన తాజా సినిమా ‘అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈచిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘1'(నేనొక్కడినే) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందు. ఈచిత్రం ఇప్పుడు యూరఫ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
Read more at: http://telugu.oneindia.in/movies/gossip/2013/07/star-hero-s-hike-remuneration-119928.html
Read more at: http://telugu.oneindia.in/movies/gossip/2013/07/star-hero-s-hike-remuneration-119928.html
No comments:
Post a Comment