నాగార్జున వన్ఇండియా బస్: ఎక్కడైనా, ఎప్పుడైనా టిక్కెట్ బుక్ చేసుకోండి ముంబై: ''ఈ మధ్య కాలంలో చాలా తెలుగు సినిమాలు హిందీలోకి రీమేక్ అవుతున్నాయి. ఇది మంచి పరిణామం. రెండు ప్రాంతాల వారు ఇప్పుడు అన్ని ప్రాంతాల సినిమాల్ని ఆదరిస్తున్నారు. అయితే నాకు మాత్రం ఇతర భాషల సినిమాల తెలుగు రీమేక్‌లో నటించే ఉద్దేశం లేదు'' అని నాగార్జున అన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నాగార్జున మంగళవారం ముంబయి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అమితాబ్ గురించి చెప్తూ.... ''అమితాబ్ బచ్చన్ వయసుని బట్టి అతని శక్తిని అంచనా వేయలేం. ఎందుకంటే ఆయన కళ్లలో ఇప్పటికీ తొలి సినిమా చేసినప్పటి మెరుపు కనిపిస్తుంది. సినిమా అంటే అదే ప్రేమ.. అదే శక్తి. ఇది ఆయనకి మాత్రమే సాధ్యము. అమితాబ్ ఓ లెజెండ్. ఆయన్ని కలిసిన ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుసుకుంటాన'' అన్నారు నాగార్జున. ఇక బాలీవుడ్‌వైపు మరోసారి అడుగులేస్తారా అంటే.. ''ఆసక్తికరమైన కథ దొరికితే ఆలోచిస్తాను''అన్నారు. ప్రస్తుతం నాగార్జున భాయ్ షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. నాగార్జున, రిచా గంగోపాధ్యాయ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'భాయ్'. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు. ఈ చిత్రం ఆగస్టు లో ఆడియోని విడుదల చేసి, వినాయిక చవితికి సినిమా విడుదల చేసే ఆలోచలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ‘అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. మరో అయిదురోజుల్లో క్లైమాక్స్ పూర్తికానుంది. ఇంకా 2 పాటలు, 1 పోరాట సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. నాగార్జునలోని మాస్ యాంగిల్‌ని క్లాస్‌గా ప్రెజెంట్ చేస్తూ వీరభద్రం చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంభాషణలు చాలా శక్తిమంతంగా ఉంటాయనేది యూనిట్ వర్గాల సమాచారం. కామెడీ, యాక్షన్ కొత్త పుంతలు తొక్కే విధంగా ఉంటాయని చెబుతున్నారు. ఆగస్టు నెలాఖరున కానీ, సెప్టెంబర్‌లో కానీ ‘భాయ్'ని విడుదల చేయడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్, సోనూ సూద్, ఆశిష్ విద్యార్థి, అజయ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్
English summary Nagarjuna is happy with the remake trend of south films in Hindi and vice versa. "It is a healthy sign... it shows our culture is same. Films of north and south are liked by audience of both the regions," he said. But personally, Nagarjuna would not like to remake any film.
Read more at: http://telugu.oneindia.in/movies/spotnews/2013/07/nagarjuna-don-t-want-act-remakes-119527.html
English summary Nagarjuna is happy with the remake trend of south films in Hindi and vice versa. "It is a healthy sign... it shows our culture is same. Films of north and south are liked by audience of both the regions," he said. But personally, Nagarjuna would not like to remake any film.
Read more at: http://telugu.oneindia.in/movies/spotnews/2013/07/nagarjuna-don-t-want-act-remakes-119527.html
No comments:
Post a Comment