Wednesday 31 July 2013

పంచాయతీలో కాంగ్ జోరు: ధీటుగా టిడిపి, జగన్‌పార్టీ థర్డ్

పంచాయతీలో కాంగ్ జోరు: ధీటుగా టిడిపి, జగన్‌పార్టీ థర్డ్

Posted by: 
Published: Wednesday, July 31, 2013, 19:43 [IST]
Ads by Google
Hair Loss Treatment 
Visible Results In Over 92% Patients. Visit Dr. Batra's Now!
www.DrBatras.com/Hair-Loss
Rs.115 Off On Bus Booking 
Use Code Bus115 & Get Rs.115 Off. Only at Goibibo.Hurry Book Bus Now!
goibibo.com/Bus-Offer
హైదరాబాద్: మొదటి రెండు పంచాయతీ ఎన్నికలలో ముందంజలో నిలిచిన అధికార కాంగ్రెసు పార్టీ మూడో అంచెలో కూడా హవా కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన ముడో విడత ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మొదటి స్థానంలో, తెలుగుదేశం రెండో స్థానంలో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడో స్థానంలో, తెలంగాణ రాష్ట్ర సమితిలో నాలుగో స్థానంలో ఉన్నాయి. టిడిపి, కాంగ్రెసుల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది. రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మొదట వార్డు మెంబర్ల ఓట్లను, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీరహితంగా జరిగినప్పటికీ అన్ని పార్టీలు తమ తమ మద్దతుదారులను పోటీకి దింపి బలాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేశాయి. పలు జిల్లాల్లో స్వతంత్రులు పెద్ద ఎత్తునే గెలిచారు. తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి, యూపిఏ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆ ఫలితం అంతగా కనిపించలేదనే చెప్పవచ్చు. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరగడమే కాకుండా, స్థానిక అభ్యర్థిని బట్టి ఉంటాయి. అందుకే ఆ ప్రభావం అంతగా కనిపించలేదని చెప్పవచ్చు.
పంచాయతీలో కాంగ్ జోరు: ధీటుగా టిడిపి, జగన్‌పార్టీ థర్డ్
శ్రీకాకుళం, కర్నూలు, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెసు ముందంజలో ఉంది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఎస్పీఎస్ నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో టిడిపి, ప్రకాశం, కడప, జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ముందంజలో ఉంది. పలు జిల్లాల్లో కొన్ని పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి.
నేతలకు షాక్
కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు స్వగ్రామం దోసపాడులో కాంగ్రెసు మద్దతుదారుపై టిడిపి మద్దతుదారు, కేంద్రమంత్రి కిల్లి కృపారాణి స్వగ్రామం పోలవరంలో కాంగ్రెసు మద్దతుదారుపై స్వతంత్ర అభ్యర్థి, తెరాస ఎమ్మెల్యే జూపల్లి కృష్ణా రావు స్వగ్రామం పెద్దదగడలో తెరాస మద్దతిచ్చిన అభ్యర్థిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు గెలుపొందారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తోడికోడలు విజయలక్ష్మి ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా గూడురు మండలం వెంకన్నపాలెంలో గెలుపొందారు.
రాజులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వగ్రామం చింతలమోరిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు, అనంతపురం జిల్లా శింగనమలలో మంత్రి టిడిపి మద్దతుదారు గెలుపొందారు. ఇక్కడి నుండి మంత్రి శైలజానాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉరవకొండ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వస్థలం నిమ్మకూరులలో టిడిపి మద్దతుదారులు, బసవతారకం స్వగ్రామం కొమరోలులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
అత్యుత్తమ, నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్

No comments:

Post a Comment