Thursday, 25 July 2013

మహేష్ బాబు ‘1’(నేనొక్కడినే) డైలాగులు లీక్.

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘1'(నేనొక్కడినే) సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ యూరఫ్ లో జరుగుతోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన డైలాగులు కొన్ని లీకైయ్యాయి. ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న ఈ డైలాగులు ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఇవే ఆ లీకైన డైలాగులు...
1. నా స్పీడుకు కామా పెట్టాలనుకోకు, నీ లైఫ్‌కి పులిస్టాప్ పడిపోద్ది
2. నేను ఫాంలోకి వచ్చాకే ఫిక్స్ అవుతా....ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.
3. నా వాయిస్‌లో ఫ్రీక్వెన్స్ బట్టి నా వయోలెన్స్ ఏ రేంజిలో ఉంటుందో నువ్వే డిసైడ్ చేసుకో...
4. మంచిగా ఉన్నంత వరకే నేను హీరోని, తేడా వచ్చిందో...చరిత్ర చూడని నెపోలియన్‌ని...ప్రపంచం చూడని హిట్లర్‌‌ని...నీకు నేను ఎక్ల్సూసివ్‌‌గా చూపిస్తా...
సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే....ఈ చిత్రంతో మహేష్ తనయుడు గౌతం చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగ్రేటం చేస్తున్నాడు. అలాగే జాక్విలెన్ ఫెర్నాండేజ్ ఐటమ్ సాంగ్ ఈ చిత్రానికి హైలైట్ అవుతోందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.
సంక్రాంతి కానుకగా ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ పాత్ర పెక్యులర్‌గా ఉంటుందని, తాను ఒక్కడే అయినా... తన ప్రమేయం లేకుండానే ఇద్దరుగా ప్రవర్తిస్తాడని కొందరంటుంటే... ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మహేష్.. తన కెరీర్‌లో ఇప్పటివరకూ టచ్ చేయని పాత్ర ‘1'లో చేస్తున్నట్లు మాత్రం వినపడుతోంది. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరోలు ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటారు. మరి ఇందులో మహేష్ పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో అనేది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్న అంశం.

No comments:

Post a Comment