Thursday, 25 July 2013

పవన్ కళ్యాణ్‌తో సమంత మరో సినిమా!

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హాట్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘అత్తారింటికి దారేది' చిత్రంలో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. సమంత సుడి ప్రకారం ఆమెకు పవన్ కళ్యాణ్‌‍తో మరో సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సమంత టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఏ స్టార్ హీరో అయినా, స్టార్ దర్శకుడు అయినా ప్రస్తుతం ముందుగా ప్రాధాన్యత ఇచ్చే మీరోయిన్ ఆమెనే. అందుకే సమంత ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్లతో రెండే సినిమాల అవకాశాలు దక్కించుకుంది. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో మహేష్ బాబుతో, బృందావనం, రామయ్యా వస్తావయ్యా చిత్రాల్లో ఎన్టీఆర్‌తో చాన్స్ కొట్టేసింది. అత్తారింటికి దారేది   | పవన్ కళ్యాణ్‌   త్వరలో మరింత మంది స్టార్ హీరోల సరసన సమంత నటించబోతోంది. కొందరైతే ఆమె డేట్స్ కోసమే ప్రత్యేకంగా ఎదురు చూస్తుండటం గమనార్హం. అయితే సమంత మాత్రం వపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయాలని ఉబలాట పడుతోంది. ఇటీవల ఆడియో వేడుకలో కూడా ఈ విషయం బయట పెట్టింది. మరి సమంతకు పవర్ స్టార్‌తో మరోసారి చేసే అవకాశం ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి. ప్రస్తుతం సమంత పలు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం', ‘రామయ్యా వస్తావయ్యా', ‘రభస'తో పాటు మరో రెండు చిత్రాలు చేస్తోంది.

Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/07/samantha-once-again-act-with-pawan-kalyan-119956.html

No comments:

Post a Comment