Tuesday, 23 July 2013

షీర్‌ కుర్మా: రంజాన్ స్పెషల్ ట్రీట్

రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల. అత్యంత కఠోర నియమాలతో ఈ నెలలో ఉపవాసాలు చేస్తారు.. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మంచి నీరైనా ముట్టరు. వీరు సూర్యోదయానికి ముందు..సూర్యాస్తమయం తర్వాత బలమైన ఆహారం తీసుకుంటారు. బలమైన ఆహారంతో పాటు, వారికి ఇష్టమైన వంటలను ఈ నెలలో ఎక్కువగా తయారు చేసుకొని, వారి ఉపవాస దీక్షను తీర్చుకొంటారు. అందుకు శాకాహారం, మాంసాహారమే కాకుండా, కొన్ని రకాల తీపి రుచులను కూడా ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. అందులో ఒకటి ఈ షీర్ కుర్మా. ఇది పాపులర్ మొఘలాయ్ డిజర్ట్. దీన్ని సేమియా మరియు కొన్ని రకాల ఎండు ఫలాలతో తయారు చేస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్, యాలకులతో ఈ స్పెషట్ స్వీట్ ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంటి. మరి ఈ మొఘలాయ్ స్పెషల్ ట్రీట్ ను ఈ రంజాన్ వేళ ఎలా తయారు చేయాలో ఒక సారి చూడండి... కావలసిన పదార్థాలు: సన్నని సేమియా: 1cup పాలు: 6cups పంచదార: రుచికి సరిపడా నెయ్యి: తగినంత సన్నగా తరిగిన బాదంపప్పు: 1tbsp సన్నగా తరిగిన పిస్తాపప్పు: 1tbsp నానబెట్టి తొక్క తీసిన చిరోంజి గింజలు: 1tbsp మెలన్‌ సీడ్స్‌: 1tbsp సన్నగా తరిగిన ఖర్జూరం: 1tbsp కుంకుమ పువ్వు: 1/2tsp కిస్‌మిస్‌: 1tbsp జాజికాయ పొడి: 1tsp యాలకుల పొడి: చిటికెడు తయారుచేయు విధానం: 1. ఒక కప్పు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచుకోవాలి. 2. మిగిలిన పాలను వెరొక గిన్నెలో పోసి మరగనివ్వాలి, మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి పాలు నాలుగో వంతు ఇంకే వరకూమరిగించాలి. 3. అంతలోపు, ఒక ఫ్రైయింగ్ పాన్ (అడుగు భాగం మందంగా ఉండేది) తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కిస్‌మిస్‌, బాదం, చిరోంజి, పిస్తా, మెలన్‌ గింజలను వేయించి పక్కకు పెట్టుకోవాలి. 4. మిగిలిన నెయ్యిలో సేమ్యాలను దోరగా వేయించుకొని ఇదివరకు మరింగించి పెట్టుకున్న పాలను పోసి ఉడకనివ్వాలి. 5. ఇది ఉడుకుతుండగా కర్జూరం, కుంకు మపువ్వు కలిపిన పాలను పోసి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడింకిం చాలి. 6. సేమియా బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి, దీనిని వేడిగా అయినా వడ్డించుకోవచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్‌ చేసుకోవచ్చు. అంతే షీర్ కుర్మా రెడీ.

Read more at: http://telugu.boldsky.com/recipes/snacks/sheer-khurma-sweet-treat-ramzan-006253.html

No comments:

Post a Comment