Published: Thursday, July 18, 2013, 15:53 [IST] Ads by Google Apartments For Sale 1,2,3BHK Flats by Shriram Group in Guduvancheri Chennai shriramproperties.com/projects/chennai Booked Bus With Goibibo™ Now Get Rs.800 Off On Hotel Booking above Rs.2500. Use Code: HTL800Off goibibo.com/hotels/offer లండన్: ప్రతిష్టాత్మక ఆసియన్ లైట్ సొలిసిటర్ ఆఫ్ ది ఇయర్ 2013 అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పావని రెడ్డి ఎంపికయ్యారు. ఈ అవార్డును బ్రిటన్‌లో తెలుగువారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. జైవల్లా అండ్ కో సొలిసిటర్స్ సంస్థకు మొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పావని రెడ్డి బ్రిటన్ సుప్రీంకోర్టు, కోర్ట్ ఆఫ్ అప్సీల్స్‌లో సంచలనాత్మక కేసులెన్నింటినో వాదించి విజయం సాధించారు. భారత్‌లోనే న్యాయవిద్యను పూర్తిచేసిన పావని రెడ్డి 2005లో టైవల్లా ఎండ్ కో సొలిసిటర్స్‌లో భాగస్వామిగా చేరారు. ఆసియా దేశాలకు చెందిన అనేక క్లిష్టమైన కేసులను వాదించిన ఆమె తన వాదనాపటిమతో అద్భుత విజయాలు సాధించారు. 1982లో స్థాపించిన జైవల్లా అండ్ కో లండన్‌లో పురాతన న్యాయ సంస్థగా గుర్తింపుపొందింది. ఆసియన్ లైట్ పత్రిక ఆరవ వార్శికోత్సవం సందర్భం గా నిర్వహించిన కార్యక్రమంలో పావనిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. పావని రెడ్డి ఇటీవలే బ్యాంక్ మిల్లెట్, ఇరాన్‌కు చెందిన ప్రైవేటు బ్యాంకు కేసుల్లో విజయం సాధించి ప్రశంసలందు కున్నారు. పావని రెడ్డి 2010లో ఆసియన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 2012లో గ్లోరీ ఆఫ్ ఇండియా అవార్డుకూడా గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మకమై న అవార్డు తనకు గర్వకారణంగా ఉందని పావని రెడ్డి అన్నారు. తనకు ఈ అవార్డు రావడం వల్ల వ్యాపార, వృత్తి రంగాల్లో రాణిస్తున్న దక్షిణాసియా సంతతికి చెందినవారి మీద మరింతగా దృష్టి పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Read more at: http://telugu.oneindia.in/nri/2013/pavani-reddy-wins-solicitor-of-the-year-award-2013-119620.html
Read more at: http://telugu.oneindia.in/nri/2013/pavani-reddy-wins-solicitor-of-the-year-award-2013-119620.html
No comments:
Post a Comment