Friday 9 August 2013

ఇదీ... వ్యాయామ ‘చిత్రమ్’...

ఇదీ... వ్యాయామ ‘చిత్రమ్’...

Sakshi | Updated: June 29, 2013 04:14 (IST)
ఇదీ... వ్యాయామ ‘చిత్రమ్’...
హైదరాబాద్ జిల్లా :
వ్యాయామాల్లో రన్నింగ్ అడ్వయిజబుల్ కాదు. వాకింగ్, లేదా సైక్లింగ్ బెటర్. మట్టి, గడ్డి ఉన్న చోట మాత్రమే నడక మంచిది. 
 
 ‘‘కండలు తిరిగిన మగాడి కళ్లలో భయం చూస్తుంటే... భలే మజాగా ఉంది’’ అంటూ దెయ్యం పట్టిన హీరోయిన్ వికృతమైన ముఖంతో అంటుంటే భయంతో చెమట్లు పట్టిన అబ్బాయి... అభినయంతోపాటు అందంతో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరోల కొరత తీర్చేలా తెరపై తళుక్కుమన్న ఆ అబ్బాయి ‘‘ప్రేమ కథాచిత్రమ్’’ హీరో సుధీర్‌బాబు. గ్రీకు శిల్పం లాంటి తన ఫిజిక్ వెనుక రహస్యాల్ని ఆవిష్కరిస్తూనే... ‘సాక్షి ఫ్యామిలీ’ పాఠకులకు కొన్ని ఫిట్‌నెస్ టిప్స్ కూడా అందించారు సుధీర్. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...
 
 క్రీడలే తీర్చిదిద్దాయి...
 
 చిన్న వయసు నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం అనేది ఎవరికైనా మంచి ఫిట్‌నెస్‌ని, ఆరోగ్యాన్ని అందిస్తుందని నా విషయంలో రుజువైంది. టీనేజర్‌గా ఉన్నప్పుడే షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. తర్వాత తర్వాత పుల్లెల గోపీచంద్ పార్ట్‌నర్‌గా జాతీయస్థాయిలో ఆడాను. అలాగే సినిమాల్లోకి రాకముందే ఫిట్‌నెస్ రొటీన్ ఉండేది. కొన్నేళ్ల నుంచి మారకుండా స్థిరంగా ఉన్న నా రెగ్యులర్ వెయిట్ 73 కిలోలు. వారానికి కనీసం 4 నుంచి 5 రోజులు తప్పనిసరిగా వ్యాయామానికి సమయం కేటాయిస్తాను. అలాగని గంటల తరబడి చేయను. రోజుకి 30 నుంచి 40 నిమిషాలు అంతే. సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఫిట్‌గా ఉన్నా కాబట్టి...  సిక్స్‌ప్యాక్ కోసం స్పెషల్ వర్కవుట్స్ చేశాను. ఆరునెలల్లోనే సాధించాను. అయితే దీనికోసం ప్రయత్నించేటప్పుడు ముఖవర్చస్సు దెబ్బతినకుండా డైట్ స్పెషల్‌గా తీసుకున్నాను.  ఆలివ్ ఆయిల్, పప్పులు, పీనట్ బటర్ వంటి మంచి ఫ్యాట్‌ని అందించే ఫుడ్‌ని రెగ్యులర్‌గా వినియోగించాను. అయితే సినిమాల కోసం అని కాకుండా ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండడానికే నేను ప్రయత్నించాను. నా సర్కిల్‌లో సుధీర్ అనగానే ఫిట్‌గా ఉంటాడనే ఐడెంటిటీ ఉంది. అది పోగొట్టుకోకూడదనే నా ఆలోచన. 
 
 పరిగెత్తవద్దు...పాలు తాగొద్దు...
 
 ఏదో సామెత అనుకుంటున్నారా? కాదండీ. ఇది  ఆరోగ్య సూత్రం మాత్రమే. కాని ‘మేత’కు సంబంధించే అనుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. కొవ్వులు, ప్రొటీన్... అందరికీ కావాలి. కాకపోతే వయసు, బరువును బట్టి... అవసరం మారుతుంటుంది. చిన్నపిల్లలకు కొన్ని రకాల ఎంజైమ్స్ ఉద్భవిస్తాయి కాబట్టి వారికి ఓకే కాని... ఒక వయసు దాటిన తర్వాత పాలు మనకి జీర్ణం కావు. కాబట్టి పాలు తాగకూడదు.  సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా ఎవరైనా సరే... మన దేహపు బరువుకి 2 రెట్లు ప్రొటీన్ మనకి అవసరం. అంటే సన్నగా మారాలనుకున్నవారు కూడా ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాల్సిందే. ఇక లావుగా ఉన్నవాళ్లు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే రైస్, గోధుమ వంటివి తగ్గించాలి. షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అసలు మంచిదికాదు. కాఫీ, టీలలో పంచదార కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు పెరుగు ఓకే. బాడీలో ఇమ్యూనిటీని అది పెంచే అవకాశం ఉంది. తగిన శారీరక శ్రమ ఉన్నవాళ్లు రోజుకి 6సార్లు ఆహారాన్ని విభజించాలి. రోజులో 150గ్రా.చికెన్ లేదా దాంతో సమానమైన ప్రొటీన్ ఫుడ్, ఎగ్‌వైట్స్ తీసుకోవాలి. ఆరుసార్లు కుదరకపోతే... ప్రొటీన్‌షేక్స్‌ని ఆహారంలో భాగం చేయవచ్చు. 
 
  స్లిమ్‌గా ఉండాలంటే  ప్రతిరోజూ కార్డియో వాస్క్యులర్ ఎక్సర్‌సైజ్‌లు తప్పనిసరి. ఈ వ్యాయామాలు చేసే సమయంలో 220 నుంచి మన వయసును మైనస్ చేసి ఆ వచ్చిన  దానిలో 65 శాతంతో సమానంగా మన పల్స్‌రేట్ ఉండాలి. అదే పల్స్‌రేట్ మెయిన్‌టైయిన్ చేయాలి. అంతకన్నా పల్స్‌రేట్ పెరిగితే అవసరమైన మజిల్ కూడా నష్టపోతాం. అలాగే- 
 
 ఒక రోజున ఒకటి లేదా రెండు మజిల్స్‌కి మించి ఒకేసారి వ్యాయామం ఇస్తే... సరైన ఫలితం రాదు. ఉదాహరణకి సోమవారం ఛాతీకి సంబంధించిన ఎక్సర్‌సైజ్ చేస్తే మంగళవారం మరో మజిల్... ఇలా మార్చుకుంటూ పోవాలి. తిరిగి ఛాతీకి వ్యాయామం చేసే సమయానికి అది పూర్తిగా రికవరీ అయి ఉంటుంది. వ్యాయామాల్లో రన్నింగ్ అడ్వయిజబుల్ కాదు. వాకింగ్, లేదా సైక్లింగ్ బెటర్. మట్టి, గడ్డి ఉన్న చోట మాత్రమే నడక మంచిది. అలాగే  సరిగ్గా నప్పే షూస్ ధరించాలి. 
 
 .... ఇవీ టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ సుధీర్  చెప్పిన ఫిట్‌నెస్ కబుర్లు. ఈ నవయువ హీరోకి ఆరోగ్యాభిలాషుల తరపున థ్యాంక్స్.
 

No comments:

Post a Comment