Friday 16 August 2013

అడ్డా రివ్యూ..!

అడ్డా రివ్యూ..!
07:59 PM on 15th August, 2013

ఐదేళ్ల కిందట టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సుశాంత్‌కు సరైన హిట్ లేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ‘అడ్డా’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మరి ఈ సినిమా యంగ్ హీరో కెరీర్‌ని నిలబెడుతుందా..? లేదా తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం. హీరో సుశాంత్‌ రిజిస్టార్ ఆఫీస్‌‌ని త‌న ‘అడ్డా’గా చేసుకొని జీవితం సాగిస్తుంటాడు. అక్కడికి పెళ్లిళ్లు చేసుకోవాల‌ని వ‌చ్చిన ప్రేమజంట‌ల్ని క‌లిపి, విడ‌గొట్టి డ‌బ్బులు సంపాదించడం ఇతడి హాబీ. ఆ ఊరు పెద్దమ‌నిషి నాగినీడుకి  సుహాసిని, శాన్వి అనే ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురుని దేవ్‌‌గిల్‌కి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకొంటాడు. కానీ సుహాసిని మాత్రం అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌ని ప్రేమిస్తుంది. అక్క ప్రేమని విడ‌గొట్టడానికి హీరోయిన్ శాన్వి... హీరో సుశాంత్‌ని ప్రయోగిస్తుంది. ఈ క్రమంలో శాన్వి-సుశాంత్‌లు లవ్‌లో పడతారు. అయితే సుశాంత్ మాత్రం డ‌బ్బుల కోసం సుహాసిని-అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌‌ల‌ను విడ‌గొడతాడు. దాంతో శాన్వి... సుశాంత్‌ని ఛీ కొడుతుంది. ప్రియురాలు దూరమయ్యాక సుశాంత్‌కి ప్రేమ విలువ తెలుస్తుంది. మ‌రి వీరిద్దరూ ఎలా ఒక్కటవుతారనే విష‌యాలు తెర‌పై చూడాలి.

స్టోరీ సూపర్‌గా వుంది. క‌థ చెప్పి సుశాంత్‌, నిర్మాత‌ల‌ను ఒప్పించిన డైరెక్టర్ కార్తీక్... ప్రేక్షకుల మెప్పు పొంద‌లేక‌పోయాడు. కానీ ద‌ర్శకుడికి అనుభ‌వం లేకపోవడం కొట్టిచ్చినట్లు కనిపించింది. ఇంటర్‌వెల్ వరకూ పర్వాలేదనిపించిన కార్తీక్... ఆ తర్వాత మాత్రం అదే స్పీడ్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. చాలా పాత్రలను వృథాగా వ‌దిలేశాడు. సీనియర్ నటుడు కోట శ్రీ‌నివాస‌రావుని ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రకి ప‌రిమితం చేశాడు. త‌నికెళ్లభ‌ర‌ణి, నాగినీడు కేవ‌లం బొమ్మలుగానే మిగిలారు.  సినిమాలో సుశాంత్ దూకుడు ఎక్కువగానే కనిపించింది. ట్విస్టులను అనుకూలంగా మలచుకోవడంలో విఫలమయ్యాడు. సుశాంత్ యాక్టింగ్ పరంగా బాగానే చేశాడు. గ‌త రెండు సినిమాల‌తో పోలిస్తే కాస్తా బెట‌రనిపించాడు. కాకపోతే కొన్ని స‌న్నివేశాల్లో ఇబ్బందిపడినట్లు కనిపించాడు. శాన్విని చాలా అందంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. గుర్తు తెచ్చుకొనే సన్నివేశాలు పెద్దగా లేవనే చెప్పాలి. సాంకేతికంగా సినిమా బాగుంది. సాంగ్స్ చిత్రీక‌ర‌ణ పర్వాలేదనిపించాడు. కార్తీక్ కొత్త దర్శకుడు కావడంతో త‌న‌కు తెలిసిన విద్యల‌న్నీ చూపించాలని అనుకున్నాడు. ఏదో చూడటానికి కాస్త పర్వాలేదనిపించాడు.

No comments:

Post a Comment